మండలంలోని తపాలాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ కోలంగూడ గ్రామంలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది సికిల్ సెల్, ఎనీమియా వైద్య పరీక్షలు చేశారు. మంగళవారం గ్రామంలో పర్యటించి రక్తహీనత, పోషకాహార లోపం గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అందరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.కార్యక్రమంలో ఎంఎలెచ్పీ సందీప్, హెల్త్ అసిస్టెంట్ కమలాకర్, ఏఎన్ఎం మాధవి, ఆశా వర్కర్లు విజయ, లలిత, తదితరులు పాల్గొన్నారు.