
దివ్యాంగులైన తమ పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకొని ప్రతి గురువారం భవిత కేంద్రానికి వచ్చి ఫిజియో థెరఫీ చేయించుకోవాలని మండల విద్యాశాధికారి తరి రాము అన్నారు. మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా ఆటల పోటీలు నిర్వహించి మండల కేంద్రం లోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మాట్లాడారు. అవయవలోపాన్ని మరచి, స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. దివ్యాంగులను అన్నిరంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగులైన విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఫిజియో థెరఫీకి వచ్చిన వారికి చార్జీలు, భోజన వసతి కల్పించ బడునని తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ఇచ్చి,వారి తల్లిదండ్రులను ఘన సన్మానం చేసి భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ రమేష్, కవిత, స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ శ్రీనివాస్, స్పెషల్ ఎస్జిటి మహేష్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శేషు, ఝాన్సీ,శ్రీనివాస్, సుదర్శన్, సిఆర్పిలు పరమేష్, సక్రాం,విజయ, రమేష్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.