నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నాను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నాగౌడ్ నారా గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బగోని అశోక్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నగౌడ్ నారా గౌడ్ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీల దేశవ్యాప్త కుల గణన సాధన కోసం డిసెంబర్ 2024 16 నుండి 18 వ తేదీ వరకు జరగబోయే కార్యక్రమానికి బీసీ నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కదిలి రావాలని సభను విజయవంతం చేయాలని కోరారు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం విద్యా వైద్య ఉద్యోగ రంగాలలో వారి వాటా కోసము జంతర్ మంతర్ వద్ద ధర్నా కోసం వెళ్తున్నట్లు తెలిపారు. చట్టసభలలో బీసీలకు తమ రావలసిన వాటా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తెలియజేశారు. ఈ యొక్క సభకు అన్ని బీసీ సంఘాల నాయకులు హాజరై యొక్క సభను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన యొక్క బీసీలకు సాధన కోసం అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు కొయ్యడ నరసింహులు గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు రాజు గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం యూత్ కార్యదర్శి కపిల్, పవర్, తదితర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.