ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా ఈ నెల 7, 8వ తేదిలలో మండలములోని గ్రామాలలో సీఎం కప్పు క్రీడ పోటీలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక ఎంపీడీవో అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక అధికారులతో సన్నాహక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో నుండి మండల స్థాయి క్రీడ పోటీలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తన సహాయ సహకారాలు అందించి క్రీడలను విజయవంతం చేయాలని, క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా తగిన మౌలిక వసతులను కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.క్రీడల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల ప్రతిభావంతులను గుర్తించి వారికి తగిన విధంగా ప్రోత్సాహాన్ని అందించాలన్నారు.ఈ విషయంలో క్రీడలను విజయవంతం చేయడానికి స్థానిక సిఏ ఏ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని,తమ వంతు సహకారం అందించాలన్నారు.ఈ క్రీడ పోటీలు అత్యంత ముఖ్యమైనవిగా భావించి అందరు తప్పకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని విజయవంతం చేయవలసిందిగా అందరిని ఈ సందర్భంగా కోరారు. అనంతరం10,11,12 తేదీలలో మండల స్థాయిలో జరిగే క్రీడ పోటీలను సక్రమంగా నిర్వహించి విజయవంతం చేయవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ కిరణ్ కుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాల శ్రీనివాస్, ఎంపీ ఓ అఫ్జల్, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల పిడి పిఎటిలు తదితరులు పాల్గొన్నారు.