నవతెలంగాణ – మాక్లూర్
సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు పిట్ల ఎల్లన్న 34వ స్మారక సభను గడుకోల్ గ్రామంలో 2024 డిసెంబర్ 16న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు తెలిపారు. మంగళవారం మండలంలోని బోర్గం (కే) గ్రామంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కరపత్రాలను ఆవిష్కరించారు. పేదింటిలోపుట్టిన ఎల్లన్న, శ్రమజీవుల రాజ్యం కోసం రైతు కూలీ సంఘం నాయకుడిగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని ఆయన తెలిపారు. 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో పాలకులు మారిన ప్రజల బతుకులు మారడం లేదని దాసు ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం విఫలం చెందిందని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని దాసు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోడు భూములకు పట్టాలను ఇవ్వాలని, రుణమాఫీ మిగిలిన వారందరికీ యుద్ధ ప్రాతిపదికను జమ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజ మార్పు కోసం పోరాటమే ఎల్లన్నకు నిజమైన నివాళులు అన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు సూర్య శివాజీ, దేశెట్టి సాయి రెడ్డి, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జే.పీ.గంగాధర్, ఎల్. పర్వయ్య, రాపాని గంగాధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.