నవతెలంగాణ – చందుర్తి
ఈ ఫోటో లో మనం చూస్తున్నది ఎదో పరీక్ష రాస్తున్నట్లుగా కనపడుతుంది. కానీ, అదేమీ కాదు. ప్రతి నెల మొదటి మంగళవారం ఆశ డే ఉంటుంది. దీంట్లో భాగంగా హాజరైన ఆశలను గంటల తరబడి కింద కూర్చోబెట్టి ఆరోగ్య సిబ్బంది రివ్యూ సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంతో ఆశల పై ఇంత చిన్న చూపా? అంటూ చూసే వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని పై వైద్యాధికారిని ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.
ఆశాలపై వివక్షత చూపడం సరైంది కాదు: సీఐటీయూ నాయకులు ఎర్రవెల్లి నాగరాజు
ఎంతో ఉన్నత చదువులు చదివి సమాజానికి దిక్సూచిగా ఉండే అధికారులు ఆశ కార్యకర్తల ను కింద కూర్చోబెట్టడం ఇది అవమానకరంగా ఉంది. మనిషిని మనిషిగా చూడడం మానవ లక్ష్యం ఇది అధికారులు ఆశల ను అవమాన పరచడం తప్పా మరొకటి లేదని దేనిని సీఐటీయూ తరుపున కండిస్తున్నాం.