గాంధారి మండలంలోని పెట్ సంగెం, మతు సంగెం, పోతాంగల్ కలన్,పోతంగాల్ ఖుర్దు,గుడివెనుక తండా, తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలోని వివిధ గ్రామాల్లో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, గాంధారి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంఘని బాబా, నాయకులు బామన్ సురేష్, కొల్లూరి సుభాష్ తదితరులు ఉన్నారు.