ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ

Problems of auto, cab drivers should be resolved: CITU– డిసెంబర్ 7న ఒకరోజు ఆటో, టాక్సీ, వ్యాన్, క్యాబ్, రాష్ట్ర బందును జయప్రదం చేయాలి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఆటో, క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 7న ఒక రోజు ఆటో, టాక్సీ, వ్యాన్, క్యాబ్ లు రాష్ట్ర బందును జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆటో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట డిసెంబర్ 7న ఆటో క్యాబ్ రాష్ట్ర వ్యాప్త బంధు కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన హమీల అమలుకై తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా, ఆటో, క్యాబ్ డ్రైవర్లు డిసెంబర్ 7న ఒక రోజు రాష్ట్ర వ్యాపిత బంద్ను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇబ్బందులకు గురైనారని అన్నారు. గత ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీలు, ఇతర జిల్లాల ఆటోలు హైదరాబాద్ నగరంలోకి రాకుండా నిషేధించడంలో విఫలమైనది. ప్రస్తుతం ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల మెనిఫెస్టోలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు అధికారంలోకి రాగానే సం.రానికి రూ.12వేలు ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా ఆటో మోటార్ంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆయిన ఇప్పటి వరకు ఏలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా, మహిళలకు, ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లందరికి జీవనోపాధిపై పెద్ద దెబ్బతగిలనది. నష్టపోయిన డ్రైవర్లను ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రవాణా శాఖ మాత్యులు పలు సందర్భాలలో ఆదుకుంటామని చెప్పారు. అయినా గత 12 నెలలు గడుస్తున్నా ఆదుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినడం వలన చాలా మంది డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టపోయిన డ్రైవర్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. నష్టపోయిన డ్రైవర్ల పక్షాన ఆటో, క్యాబ్ సంఘాలు అనేకమైన ధర్నాలు ఆందోళనలు చేయడం జరిగినది. ఆటో చార్జీలు పెంచవల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ఈ చార్జీలు పెంచకపోవడం వలన డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తుంది. ఆటోలు కొనుక్కోవాలంటే పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఆటో కొనుక్కోవాలి. ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అక్రమంగా నడుస్తున్న ఇతర జిల్లాలలో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలను నిషేధించి, పెరిగిన జనాభాకు అనుగుణంగా యువకులకు ఎల్పిజీ, సిఎన్జి, ఎలక్ట్రిక్ తో కూడిన కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చినట్లయితే జీవనోపాధితో పాటు ప్రజల ప్రజా రవాణా సౌకర్యం కలుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు అబ్దుల్ ముజీబ్ సయ్యద్ రఫీయొద్దీన్, జి కిషన్, కే ఉదయ్, పి విటల్, ఎం బాలాజీ, ఎం ప్రసాద్, ఎండి రఫీక్, తదితరులు పాల్గొన్నారు.