అనేస్తేషియా పోస్టు భర్తీకి దరఖాస్తుకు ఆహ్వానం ..

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా హాస్పిటల్ బోధన్లో ఖాళీగా ఉన్న (1) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిఫ్ (అనేస్తేషియా) పోస్టును కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి తేదీ 06 సమయం 11:00 గంటలకు అదనపు కలెక్టర్  కార్యాలయం (డిఓసి) నిజామాబాదు లో నిర్వహించుటకు నిర్ణయించినట్లు సూపరెండెండెంట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, నిజామాబాదు కార్యాలయం నుండి పత్రిక ప్రకటన బుధవారం విడుదల చేశారు. కావున అనుభవం వున్న ఎం. డి/డి ఏ అనేస్తేషియా వైద్యులు తమ దరఖాస్తులను, విద్యా సంబందిత ద్రువపత్రాలతో తేదీ 05-12-2024 వరకు డి. సి. హెచ్. ఎస్. (సూపరింటెండెంట్ డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నిజామాబాదు  కార్యాలయం లో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించాలన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ద్రువ పాత్రలతో అదనపు కలెక్టర్ (1/బి) నిజామాబాదు ఛాంబర్ లో డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని కోరారు.