ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

Government's focus on public health: MLAనవతెలంగాణ – పెద్దవంగర
ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, సలిదెండి సుధాకర్, లచ్చన్న, పుణ్యా నాయక్, యూత్ ఉపాధ్యక్షుడు పబ్బతి సంతోష్, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.