నవతెలంగాణ – సారంగాపూర్: అటవికి నిప్పు పర్యావరణానికి ముప్పు అని సీసీఎఫ్ శరవణన్ అన్నారు.బుధవారం అడవి శాఖ వారి ఆధ్వర్యంలో మండలంలోని చించోలి (బి) హరిత వనంలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా వన్యప్రాణుల దాడుల వల్ల నష్టపోయిన బాధితులకు చెక్కులను అందజేశారు అనంతరం అటవీకి నిప్పు అందరికీ ముప్పు ప్రచురించబడినటువంటి పోస్టర్లను డియఫ్ఓతో కలసి విడుదల చేశారు. అనంతరం అటవీ నిప్పు గురించి పజలకు అవగాహన కల్పించారు. ప్రజా ప్రతినిధులు వారి గ్రామాల్లో ప్రజలను అటవీ శాఖ వారి సహకారంతో సమన్వయం చేస్తూ అడవికి నిప్పు వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు,అటవీ శాఖకు సహకరించాల్సిందిగా కోరనైనది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీఎస్ఓ నాగిని భాను గారు, నిఘా విభాగం డిపో రవీందర్ గారు, నిర్మల్ డివిజన్ క్షేత్ర అధికారులు రామకృష్ణారావు, శ్రీనివాసరావు వేణుగోపాల్ అనిత రాథోడ్ అవినాష్, ఉప అటవీ క్షేత్రాధికారులు నజీర్ ఖాన్, సంతోష్ కుమార్, నిర్మల్ డివిజన్ అటవీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.