ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజాపాలన లక్ష్యం


నవతెలంగాణ -పెద్దవూర
ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రజాపాలన లక్ష్యం అని మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పొట్టిచేలిమ వద్ద కుంకుడు చెట్టు తాండ లిఫ్ట్ డిస్ట్రిబ్యూటరీ 08,09కాలువకు ట్రయల్ రన్ నీటివిడుదల చేసి మాట్లాడారు. ఈ లిఫ్ట్ ద్వారా కుంకుడు చెట్టు తండా,గాత్ తండా, తూటిపేట తండా, పాశవాని గూడెం, జానారెడ్డి కాలనీ, రంగుండ్ల, యల్లాపురం తండా గ్రామాల రైతుల 10,వేల ఎకరాలకు వ్యవసాయ పంట పొలాలకు నీళ్లు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మల పల్లి శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల నాయకులు పగడాల నాగరాజు,మేరావత్ మునినాయక్, అనుముల అంజి, లాలు నాయక్, భాస్కర్ నాయక్, బాలు నాయక్, సర్దార్ నాయక్,చందు, పాండు నాయక్, శంకర్ నాయక్,శ్రవణ్ కుమార్ రెడ్డి, భీమ్లా నాయక్,హరి నాయక్, నాగార్జున రెడ్డి,హనుమా నాయక్,లక్షమయ్య, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.