– స్టేట్ టీచర్స్ యూనియన్
నవతెలంగాణ కంఠేశ్వర్
రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇజాజ్ అహమ్మద్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఇలాంటి సంఘటనలు పురావతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ధర్మేందర్,శ్రీకాంత్ ఒక ప్రకటనలో కోరారు. సంఘటన పొరుగు రాష్ట్రంలో జరిగినప్పటికీ మన రాష్ట్రంలో జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ పై ఉపాధ్యాయ సంఘాలతో వెంటనే ప్రభుత్వం చర్చించాలని కోరారు.