నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గృహ హింసపై జిల్లా కేంద్రంలో
సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎసిపి రవి కిరణ్ రెడ్డి హాజరై, మాట్లాడారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వాటిని ఎలా నివారించాలి అనే విషయాలను సెమినార్ లో వివరించారు. మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అర్జునయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల లీడర్ దొనకొండ వనిత, భువనగిరి సి డి ఈ డబ్ల్యూ కౌన్సిలర్ ఎన్ సరిత, ఆర్ స్వర్ణలత, లక్ష్మీ ప్రసన్న
మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అండాలు, పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ లు బత్తిని రాములు గౌడ్ , నస్రత్ అలీ, మహిళా హెడ్ కానిస్టేబుల్ వేదవతి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, శ్రీనివాసచార్యులు, మహిళ పోలీసు సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళ విద్యార్థులు పాల్గొన్నారు.