మనో ధైర్యంతో తమలోని వైకల్యాన్ని జయిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మండల విద్యాధికారి రాజ గంగారాం సూచించారు. పట్టణంలోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు తమలోని వైకల్యాన్ని బలహీనతగా భావించకుండా.. బలంగా భావించి పట్టుదలతో చదువులు పూర్తి చేయాలన్నారు. తల్లిదండ్రులు సైతం వారిని నిరుత్సాహపరిచకుండా ప్రోత్సహించాలన్నారు. భవిత కేంద్రంలో ప్రతీ గురువారం ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలతో పాటు భవిత కేంద్రానికి వచ్చే దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. ఫిజియోథెరపీ వైద్యురాలు అరుణ దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించిన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ కిషన్ , సురేష్, ఏంఐఎస్ కోర్డినేటర్ అలేఖ్య, ఆపరేటర్ రఘు, మెసెంజర్ రవి, సీజీవీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.