
నవతెలంగాణ – అశ్వారావుపేట
మృత్తికా పరీక్షతో భూసారం అంచనా వేయొచ్చును, తద్వారా ఏ ఫోషకాలు లేమి అనే విషయాన్ని తెలుసుకోవచ్చని ఏవో శివరాం ప్రసాద్ అన్నారు.
ప్రపంచ మృత్తిక దినోత్సవం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో గురువారం మండలంలోని నాలుగు రైతు వేదిక లలో రైతులకు
మట్టి పరీక్ష ద్వారా రైతులు వేసే పంటలకు సాగు నేలల్లో ఏ ఏ పోషకాలు ఉన్నాయి,ఏం పోషకాలు తక్కువ ఉన్నాయి ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయి అనేది మట్టి పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు అని ఆయన వివరించారు.ఒక ఎకరం వ్యవసాయ భూమిలో 8 నుండి 10 చోట్ల ఆంగ్ల వి(V) ఆకారంలో గడ్డపారతో ఒక అడుగు గుంత తీసి “వి” ఆకారంలో ఉన్న గోడల నుండి పై పోర నుండి కింద వరకు ఒక పక్కకి మట్టిని సేకరించాలి. ఇలా సేకరించిన మట్టి పొలం గట్ల మీద చెట్టు నీడలో ఎరువు ఉన్న ప్రదేశంలో తీసుకోకూడదు ,చెత్తాచెదారం రాళ్లు లేకుండా తీసుకోవాలి 8 నుండి 10 చోట్ల తీసుకున్న మట్టిని కలిపి నాలుగు భాగాలుగా చేసి ఎదురెదురుగా ఉన్న భాగాలను తీసివేసి మిగతా మట్టిని 500 గ్రాములు మట్టిని కవర్లో పెట్టి రైతు పేరు, పట్టాదారు నెంబరు, సెల్ నెంబరు, గత సంవత్సరంలో వేసిన పంట,వచ్చే సీజన్లో ఏ పంట వేస్తారు ,పేపర్ మీద రాసి మరో కవర్లో పెట్టి మట్టి ఉన్న కవర్, పేపర్ ఉన్న కవర్ ను పిన్ చేసి వ్యవసాయ కార్యాలయంలో గాని,రైతు వేదిక లో సాంకేతిక సహాయకులతో పరీక్ష చేసుకొని భూసార ఫలితాలు తెలుసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు సతీష్ , సూరిబాబు, భాను, రవీంద్ర, రైతులు పాల్గొన్నారు.
ఉద్యాన పరిశోధనా స్థానంలో….
ప్రపంచ మృత్తికా దినోత్సవం లో భాగంగా స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం లో గురువారం మృత్తికా దినోత్సవాన్ని నిర్వహించారు.దీనిలో భాగంగా నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు.ఇందుకోసం మితిమీరిన రసాయన ఎరువుల వాడకం తగ్గించడం సేంద్రీయ ఎరువులు,జీవన ఎరువుల వాడకం,పచ్చిరొట్ట ఎరువులు వాడకం,పంట మార్పిడి చేపట్టడం మరియు మృత్తికా కోతని తగ్గించు చర్యలు చేపట్టడం ద్వారా ఏ విధంగా మృత్తికా ఆరోగ్యాలను కాపాడ వచ్చునో చర్చించడం వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ సి హెడ్, సైంటిస్ట్ డా. జి. విజయ కృష్ణ,రీసెర్చ్ అసోసియేట్ మౌనిక,సిబ్బంది కట్టా సుబ్బారావు,ఆకాంక్ష, రామకృష్ణ,ప్రసాద్ లు పాల్గొన్నారు.