నవతెలంగాణ – జుక్కల్ : ఆటో డ్రైవర్స్ ట్రాన్స్ ఫోర్ట్స్ యూనియన్ జుక్కల్ నియోజకవర్గ భాద్యులు సురేష్ గొండ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్లు ఒకరోజు రాష్ట్ర వ్యాప్త బందును విజయవంతం చేసి తమ డిమాండ్ల సాధన కోసం చలో మద్దత్తు గా ఆయ మండల కేంద్ర ల్లో ఆటో డ్రైవర్లు,యజమానులు,పాల్గొని బందు ను జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం వలన ఆటో క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు అధికారంలోకి రాగానే సంవత్సరానికి 12వేలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆటో, మోటారురంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్ల అందరికీ జీవనోపాధిపై పెద్ద దెబ్బ తగిలిందని నష్టపోయిన డ్రైవర్లను ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రవాణాశాఖ మాత్యులు పలు సందర్భాలలో చెప్పడం జరిగినది.ఐన ఏడాది గడుస్తున్న ఆదుకున్న దాఖలాలు లేవు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బ తినడం వలన చాలామంది డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు.నష్టపోయిన డ్రైవర్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. నష్టపోయిన డ్రైవర్ల పక్షాన గతంలో ఆటో సంఘాలు అనేకమైన ధర్మాలు, ఆందోళనలు చేపట్టడం జరిగింది. ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. యాక్సిడెంట్ బీమాను 10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింప చేయాలి.
50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్లు కనీసం 5వేలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలి.జుక్కల్ నియోజకవర్గం లొని అన్ని మండల కేంద్రాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం టాక్సీ వాహనాలకు యూనిఫామ్ నిర్ధారణ చేయాలని రేపు తలపెట్టిన ఆటోల బందును జయప్రదం చేయాలనిదీనికి ప్రజలు కూడ సహకరించాలని సురేష్ గొండ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.