నవతెలంగాణ-కంఠేశ్వర్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు శుక్రవారం అర్పించారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించి మనకు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అట్టడుగు కులాలు అనుభవిస్తున్న అణిచివేతను గ్రహించి వాటి నుండి విముక్తి పొందడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు భారత దేశం లో మహిళలు సమాజంలో సగంభాగం అని మహిళలు చదువుకుంటే భారతదేశాన్ని తీర్చిదిద్దుతారని మహిళలకు ఓటు హక్కు ఉంటే సమాజాన్ని పరిపాలించాల్సినటువంటి నాయకుల్ని వారే ఎన్నుకుంటారని పార్లమెంటులో 50 శాతం మహిళలు ఉండాలని తాను ఎదుర్కొన్న అవమానాన్ని అవహేళనన్ని ఏ అట్టడుగు కులాల వాళ్ళు ఎదుర్కోవద్దని తన జీవితాన్ని త్యాగం చేసి అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని కొంతమంది తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయులందరికీ పైన ఉంది అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు. జిల్లా అధ్యక్షురాలు అనిత జిల్లా కమిటీ సభ్యులు వనజ మాధవి తదితరులు పాల్గొన్నారు.