మత ప్రచారం, వికృతి చేష్టలు చేస్తున్న వారిని శిక్షించాలి 

నవతెలంగాణ – జూలపల్లి
 జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో నిన్న రాత్రి 9గం. లకు ఇతర ప్రాంతాలకు చెందిన గుర్తు తెలియని సుమారు 100మంది మత ప్రచారకుల డీజే శబ్దాలతో, వికృత చేష్టలతో హిందూ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా పాటలు నృత్యాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని జూలపల్లి పోలీస్ స్టేషన్లో గ్రామ ప్రజల సహకారంతో కొప్పుల మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి వెంట గన్ను వెంకటరెడ్డి, లక్ష్మరెడ్డి, పరమేష్ రెడ్డి, నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి, జంగం పరుశరామ్, జంగిల్ ఆంజనేయులు, తొంటి బీరయ్య, కోటేష్, గణవేణి అజయ్, చిప్ప కిరణ్, నాగరాజు, సంపత్ గ్రామస్తులు ఉన్నారు.