నవతెలంగాణ- సారంగాపూర్: ప్రజా సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం అని తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు మండలంలోని రైతు భవనంలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులను, ఆడపడుచులను ఉద్దేశించి మాట్లాడినారు.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడపడుచులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.500/- వంట గ్యాస్, రైతులకు రుణమాఫీ, రైతు బీమా సంబ్సిడి పై రైతులకు విత్తనాలు, ఎరువులు అందించారన్నారు. డీసీసీ అధ్యక్షులు శ్రీ హరీరావు మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. అనంతరం మహిళలు రంగవల్లి, బతుకమ్మ, సంబరాల్లో, మహిళా క్రీడలను తిలకించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, తాజా మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్ధుల్ హది, వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి,రైతు కిసాన్ సెల్ వర్కింగ్ ప్రసిడెంట్ పోతరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణ వేణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య, ఉపఅధ్యక్షులు విలాస్ రావు, తేజ్ నాయక్, డైరెక్టర్ లు పోతారెడ్డి, ముత్యం రెడ్డి, ముక్తార్, నాగోరావ్, పుష్పదన్సింగ్, నాయకులు రాజ్ మహమ్మద్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రెడ్డి, నర్సారెడ్డి, సత్యపాల్ రెడ్డి, భోజన్న, సురేందర్, గంగాధర్ , మధుకర్, ఐకేపీ ఎపిఎం మాధురి డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.