మాచారెడ్డి మండలంలోని శ్రీ పద్మనాయక వెల్మ సంఘం సభ్యులు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పద్మనాయక వెలమ సంఘం సభ్యులు మాట్లాడుతూ నిన్నటి ( శుక్రవారం ) రోజున మన వెలమ సామాజిక వర్గం మీద అనుచిత పదజాలంతో దూషించిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పైన కఠిన చర్యలు తీసుకోవాలని మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మన సంఘం సభ్యులు, వేల్పుగొండ వెలమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.