గోడ మీద పాట

గోడ మీద పాటగోడ మీద గింజలు వేసి
తలుపు చాటున ఎదురుచూస్తూ ఉండేది తను
వాలిపోతూ, దాని ఆకలంతా వాకిట్లో ఆనందం అయ్యేది
కాలం గోడమీదుగానే రాలిపోయింది
ఎంతకీ బయటికి రాని ఆమె కోసం
మూగబోయిన గొంతుతో తను
ఎదురుచూపే పాటగా గోడ మీదే ఉండిపోయింది
అలసిపోయిన కళ్ళతో ఆమె
తలుపులేసుకుని జీవితాన్ని గోడమీద జ్ఞాపకంగా చేసి వెళ్ళిపోయింది
– పి.సుష్మ, మక్తల్‌, 9959705519