చేజారిన అగ్రస్థానం!

Missed top spot!– ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్లు
దుబాయ్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025 పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానం చేజార్చుకుంది. పెర్త్‌ టెస్టులో విజయం తర్వాత మళ్లీ టాప్‌లోకి వచ్చిన టీమ్‌ ఇండియా.. ఆడిలైడ్‌ టెస్టు ఓటమితో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా అగ్రస్థానం కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా రెండో స్థానానికి చేరుకుంది. ఆసీస్‌ 60 శాతం పాయింట్లు, సఫారీలు 59 శాతం పాయింట్లు సాధించగా.. భారత్‌ 57 శాతం పాయింట్లతో కొనసాగుతుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.