నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఆర్డినెన్సుల్ని సభలో ప్రవేశపెట్టనుంది. 2024 తెలంగాణ జీతాలు, ఫించను చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్, పురపాలక సంఘాల (సవరణ) ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్స్, వస్తుసేవల పన్ను ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ (సవరణ) ఆర్డినెన్సుల్ని శాసనసభలో ప్రవేశపెడతారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2022-23 ఆర్థిక సంవత్సర తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ 9వ వార్షిక నివేదిక ప్రతిని సభలో ప్రవేశపెడతారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రకటన చేస్తారని శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు తెలిపారు.