6 గ్యారంటీలను అమలు చేసి సంబరాలు చేసుకోండి..

Implement 6 guarantees and celebrate..– మాజీ మున్సిపల్ చైర్మన్  నరసింహ గౌడ్ 
నవతెలంగాణ – అచ్చంపేట 
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆర్గారెంటులను అమలు చేసి సంబరాలు చేసుకోవాలని అచ్చంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ అన్నారు. సోమవారం అచ్చంపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఏడాది పాలన పూర్తి పేరుతో సంబరాలు చేసుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారని, నరసింహ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలకు ఆర్థిక భరోసా పేరుతో ఇస్తామన్న నెలకు రూ.2500, పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మి తో పాటు ఇస్తామన్న తులం బంగారం, వృద్ధులు వితంతువులకు, వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్ వెంటనే అమలు చేయాలని డిమాయిల్ చేశారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కల్వకుల చంద్రశేఖర్ రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అని భావించి సకాలంలో రైతు బీమా, రైతుబంధు ఇచ్చి  రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు.
 తెలంగాణ రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియాగాంధీ రూపంలోకి మార్చి విగ్రహ ఆవిష్కరణ చేసి రేవంత్ రెడ్డి చరిత్ర హీనులుగా మిగిలారన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అమినోదిన్, శంకర్ మాదిగ, కౌన్సిలర్ రమేష్ రావు పొలం రాజు కుంభం ప్రవీణ్ గౌడ్ వంశీ నాయక్ దేవా తదితరులు పాల్గొన్నారు.