సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి 

Comprehensive punishment should address the fair demands of employees– 3వ రోజు కొనసాగిన రిలే నిరసన దీక్ష 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన శాంతియుత రిలే నిరసన దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ.. గత 15 సం||రాలుగా విధులు నిర్వర్తిస్తున్నాము. విద్యాశాఖలో కీలకంగా ఉంటూ విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలి. ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా 5 లక్షల సౌకర్యం కల్పించాలి.సమగ్ర శిక్షా లోని పి.టి.ఐ లకు 12 నెలల వేతనం ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి.మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్రేషియా కల్పించాలి. 61 సం॥రాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. భారత సర్వోన్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పు చెప్పింది. 2018 పి.ఆర్సీ కమిటీ తన నివేదికలో ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి కనీస వేతనం స్కేలు (కాంట్రాక్ట్ ఉద్యోగ హోదాను బట్టి ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించే మూల వేతనం) అమలు చేయాలని సూచించింది. కావున కనీస స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆశ్రఫ్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, ప్రధాన కార్యదర్శి భూపేందర్, కోశాధికారి ప్రసాద్, మహిళ అధ్యక్షురాలు గంగామణి, పెద్ద సంఖ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.