అంకిత్ కొయ్య హీరోగా, శ్రియా కొంతం హీరోయిన్గా ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’ అనే చిత్రం రాబోతోంది. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సత్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ హర్ష దర్శకుడు. సోమవారం ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను లాంచ్ చేశారు. నిర్మాత సత్య మాట్లాడుతూ, ‘సెన్సిబుల్ మెసేజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మా సినిమాకు మరింత పాజిటివ్ వైబ్ వచ్చింది’ అని అన్నారు. ‘మనం అమృతం సీరియల్‌ను ఎంత ఎంజారు చేశామో అంతలా మా సినిమాను ఎంజాయ్ చేస్తాం. కొన్ని సార్లు ఎదుటి వాళ్ల కష్టాలను, బాధల్ని చూసి మనం నవ్వుకుంటాం. హర్ష అనే క్యారెక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన తరువాత డోర్ లాక్ అవ్వడం, ఇంట్లోనే పద్నాలుగు రోజులు ఉండటంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఈ సినిమా కథ. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది. హీరోగా నాకు మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది’ అని హీరో అంకిత్ కొయ్య చెప్పారు.