హైదరాబాద్ : కర్నాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌ఆర్‌టిసి) నుంచి రూ.33.5 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ఎబిఎక్స్‌క్యాష్ తెలిపింది. ఎరాయ లైఫ్‌స్పేసెస్‌కు చెందిన ఎబిక్స్‌క్యాష్ స్మార్ట్, టికెటింగ్, డేటా సెంటర్ సొల్యూషన్స్ అందించడానికి కెఎస్‌ఆర్‌టిసితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తొలుత 84 డిపోల్లోని 8,00 బస్సుల్లో డిజిటల్ చెల్లింపులకు వీలుగా పరికరాలను అందించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో 15వేల పరికరాలను సరఫరా చేయనున్నట్లు పేర్కొంది.