న్యూఢిల్లీ : టాటా గ్రూపులో భాగమైన ఎయిరిండియా కొత్తగా 100 విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రెంచ్‌కు చెందిన ఎయిర్‌బస్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో పది ఎ350, 90 నారోబాడీ ఎ320తో పాటు ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎ321 నియో విమనాలున్నాయి. గతేడాది దేశీయ విమానయాన కంపెనీ ఎయిర్‌బస్‌కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. దీంతో మొత్తం విమానాల ఆర్డర్ సంఖ్య 350కి పెరిగింది. ప్రస్తుత నిర్వహణ అవసరాల కోసం ఎయిర్‌బస్ ఫ్లైట్ అవర్ సర్వీసెస్ కాంపోనెంట్‌ను ఎంచుకున్నట్లు టాటా సన్స్, ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. భారతదేశ ప్రయాణికుల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాల కంటే వేగంగా పెరుగుతోందన్నారు. కొత్తగా ఆర్డర్ ఇచ్చిన వంద ఎయిర్‌బస్ విమానాలు.. ఎయిర్‌లైన్స్‌ను వృద్ధి పథంలో తీసుకెళ్లడంతో పాటు భారతదేశాన్ని అనుసంధానించే ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మార్చే తమ మిషన్‌కు దోహదం చేయనుందన్నారు.