నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా అతనికి మంజూరైన 28 వేల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ రాజలింగం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు సాయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.