
నగరంలోని ఓ వ్యక్తి మానసిక ఇబ్బందులు తాళలేక ప్రభుత్వాసుపత్రి ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన మట్ల లక్ష్మణ్ (50) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో పాటు మానసికంగా ఇబ్బందులు పడుతున్న లక్ష్మణ్ చికిత్స నిమిత్తం జీజీహెచ్ లో చేరినట్లు తెలిసింది. మానసికంగా ఇబ్బందులు పడుతున్నా లక్ష్మణ్ మంగళవారం ఆస్పత్రిలోని ఆరో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.