తెలుగులోనూ ఘన విజయం ఖాయం

Big success is sure in Telugu tooఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘పని’. హీరో, దర్శకుడు జోజు జార్జ్‌ నటించిన ఈ సినిమాను తెలుగులో ఈ నెల 13న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో అభినయ కీలక పాత్రలో నటించింది. ఆమ్‌ వర్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు  తీసుకొస్తోంది. రాజవంశీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహ రిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్‌ వీరశంకర్‌, తెలుగు ఫిలింఛాంబర్‌ సెక్రటరీ దామోదర ప్రసాద్‌ పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ప్రొడ్యూసర్‌ సిజో వడక్కన్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంతో జోజు జార్జ్‌, అభినయ వంటి మంచి ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం కలిగింది. ఈ సినిమా మలయాళం, కన్నడ, తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ అలాంటి విజయాన్నే సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రాజ వంశీ  మాట్లాడుతూ,’ఇదొక మంచి థ్రిల్లర్‌ సినిమా. 2 గంటల పాటు ఆడియెన్స్‌ను ఎంగేజ్‌ చేస్తుంది. జోజు జార్జ్‌ నటిస్తూ అద్భుతంగా రూపొందించారు. ఇలాంటి సినిమా  చేయాలంటే ధైర్యం ఉండాలి’ అని అన్నారు. ‘ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అని నటి అభినయ చెప్పారు.
నా దష్టిలో మంచి  సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలోనైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగు చిత్రాల్లో నటించి మీ ఆదరణ పొందాను. ఈ సినిమా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌. అభినయతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. మీరంతా మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా.
– హీరో, దర్శకుడు
జోజు జార్జ్‌