నేడు టీఓఏ ఎన్నికల ఫలితాలు

TOA election results today– ఓట్ల లెక్కింపునకు న్యాయస్థానం గ్రీన్‌సిగల్‌
హైదరాబాద్‌ : తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) ఎన్నికల ఈ నెల 21న ముగియగా, ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిపై సిటీ సివిల్‌ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తెలంగాణ ఒలింపిక్‌ సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా గ్రీన్‌ సిగల్‌ లభించినట్టు టీఓఏ ప్రధాన కార్యదర్శి జగదీశ్‌ యాదవ్‌ తెలిపారు. ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో నేడు ఉదయం 10.30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధ్యక్ష పదవికి ఏపీ జితేందర్‌ రెడ్డి, చాముండేశ్వరనాథ్‌లు పోటీపడగా.. ప్రధాన కార్యదర్శి పదవికి మల్లారెడ్డి, బాబు రావు పోటీపడగా, కోశాధికారి పదవి కోసం సతీశ్‌ గౌడ్‌, ప్రదీప్‌ కుమార్‌లు పోటీపడ్డారు. ఉపాధ్యక్ష పదవులు సహా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. నూతనంగా ఎన్నిక కానున్న ఆఫీస్‌ బేరర్లు నాలుగేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు. న