– తెలంగాణ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మంచు మోహన్‌బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మసాదే లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. దాడిలో గాయపడిన వ్యక్తికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, ఆ ఖర్చులన్నీ మోహన్‌బాబు భరించాలని డిమాండ్ చేశారు. మంచు మనోజ్ గురించి మోహన్‌బాబు రిలీజ్ చేసిన వీడియోలో జర్నలిస్టులను, మీడియా సంస్థల యాజమాన్యాలను నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలను మోహన్‌బాబు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.