పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

– పొగమంచుతో అదుపుతప్పిన వాహనం
– తల్లి, ఇద్దరు కుమారులు మృతి
గన్నవరం : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొగమంచు అధికంగా ఉండడంతో అదుపుతప్పి పంట కాలువలోకి కారు దూసుకెళ్లడంతో తల్లి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… పి.గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి విజరుకుమార్‌, తన భార్య ఉమ, కుమారులు మనోజ్‌, రిషిలతో కలిసి ఆదివారం విశాఖ జిల్లా అరకుకు కారులో విహార యాత్రకు వెళ్లారు. అనంతరం తిరిగి మంగళవారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరారు. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారి పేటకు వచ్చే సరికి పొగమంచు ఎక్కువగా ఉండడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది.