నవతెలంగాణ – కరీంనగర్
మున్నూరు కాపు ముద్దుబిడ్డ, మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ జయంతి సందర్భంగా బొమ్మకల్ లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహానికి పుల మాలవేసి నివాళులు అర్పించిన తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపులను ఒక తాటిపైకి తీసుకువచ్చిన ఘనత బొమ్మ వెంకన్న దక్కుతుందని, మున్నూరు కాపులు అందరూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న సేవలు మరువరావని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. మున్నూరు కాపుల పేదల పెన్నిధి బొమ్మ వెంకన్న అని ప్రజా ప్రతినిధిగా ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజల మన్నలు పొందారని ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడిన మహా నాయకుడు బొమ్మ వెంకన్నని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వసతి గృహం ట్రస్టు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, కాపువాడ సంఘం అధ్యక్షులు బొమ్మ రాతి రామచంద్రం మంకమ్మ తోట అధ్యక్షులు ముప్పిడి సునీల్, జిల్లా మున్నూరు కాపు సంఘం సమన్వయకర్త సత్తినేని శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం నాయకులు కర్ర సూర్య శేఖర్, కళ్యాడపు ఆగయ్య, విద్యార్థి వసతి గృహం ఇంచార్జ్ ముప్పిడి బాల కృష్ణ , మునిపల్లి పనిత అను రాజ్ కుమార్, దీపక్ ప్రశాంత్, కోల సంపత్ రెడ్డి బొల్లం లింగమూర్తి పసుల్ల మైపాల్ కుల బాంధవులు పాల్గొన్నారు.