
పరకాల బిట్స్ పాఠశాలలో బుధవారం రోజున గీత జయంతి వేడుకలు ప్రిన్సిపాల్ యుగేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ యుగేందర్ శ్రీ కృష్ణుడికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు భగవద్గీతలోని18 అధ్యాయాలలోని కొన్ని శ్లోకాలను వాటి భావాలతో సహా చెప్పడం అందర్నీ అలరించింది.తర్వాత రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ భగవద్గీత పరమ పవిత్రమైన గ్రంథమని దానిని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి హితోపదేశం చేశాడని. జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు కష్టాలు, కన్నీళ్లు మోదం ,ఖేదం తప్పవని అన్నింటిని ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందేనని జీవిత పాఠాన్ని నేర్పే కార్య నిర్వాహక గ్రంథం భగవద్గీత అని చెప్పారు. మనిషిలోని రాక్షస స్వభావాన్ని అంతం చేసే నిప్పు కనిక ఈ గ్రంథమని ఇది జీవితం పథాన్ని విధానాన్ని నిర్దేశించే మహా గ్రంధం అని కావున ప్రతి ఒక్కరూ రోజు ఒక శ్లోకం అయినా పటించాలని తెలియజేశారు. ప్రిన్సిపాల్ యుగంధర్ మాట్లాడుతూ గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారని గీత సాక్షాత్తు భగవంతునిచే పలకబడినది కావున ఇది పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం అని జీవితంలో సందేహాలను అంతం చేయడానికి మరియు ఆనందం ,సంతృప్తి ,పరిపూర్ణత మరియు స్వీయ ఆవిష్కరణలతో కూడిన జీవితాన్ని ఇస్తుంంది అని తెలియజేశారు.