మిడ్ డే మిల్స్ కార్మికుల సమస్యలపై ధర్నా..

నవతెలంగాణ – వేములవాడ: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బుధవారం వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం ఇస్తా అని చెప్పి, అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న నేటి వరకు హామీ నిలబెట్టకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో 54,200 మంది మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యన భోజన పథకం పై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల గత 23 సంవత్సరాలు నుండి ప్రభుత్వాలు మారిన సమస్యలు తీరడం లేదు, పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని, ప్రతినెల 5వ తారీఖు లోపు బిల్లులు చెల్లించాలని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు లక్ష రూపాయల లోపు రుణాలను చెల్లించాలని, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిన చేయాలి అని కోరారు. నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 18 వేల రూపాయలు కేరళ ప్రభుత్వం 26 వేల రూపాయలు వేతనాన్ని ఇస్తుందని ఆ రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటియుసి పక్షాన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 3000 రూపాయల జీతం చెల్లించడం చాలా దుర్మార్గమని అన్నారు. శ్రమకు తగ్గ వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తెలిపిన అమలు చేయకపోవడం హేయమున చర్య అని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించిన యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని రాములు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్, కె.వి అనసూర్య , బి రెడ్డి, లక్ష్మి, రాజమణి, వెంకట నరసవ, జ్యోతి, మానస, రోజా, లత ,నరసయ్య ,విజయ, మానస, లక్ష్మీనరసవ, లింబవ, రాజవ్వ, సుజాత, తదితరులు ఉన్నారు.