సీఎం కప్ మండల స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో రాణించి కప్ సాధించాలని ఎంపీడీవో పి జవహర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ 2024 క్రీడలు ముగియగా గెలుపొందిన వారికి ఓమతి ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా జవహార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులు అద్భుతమైన క్రీడా ప్రతి ఉది అన్నారు. జిల్లాస్థాయి క్రీడలలో కూడా ప్రతిభను చాటి కప్ సంపాదించాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అనంతరం మండల స్థాయిలో జరిగిన వాలీబాల్ కబడ్డీ కోకో మరియు అథ్లెటిక్స్ క్రీడలలో ఫస్ట్ సెకన్డ్ విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పార్టిసిపేషన్స్ ధృవీకరణ పత్రములు ఎంపీడీవో , ఎంఈఓ గొంది దివాకర్ ఎంపీ ఓ శరత్ కుమార్ మరియు పిఈటిల ల చేతుల మీదుగా అందజేయనైనది ఈ క్రీడలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి తేదీ 16 -12- 2024 రోజున వెళతారు.