సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి..

The survey should be conducted carefully.– అదనపు కలెక్టర్ అంకిత్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం మండలంలోని ఉప్లూర్, నాగపూర్, కమ్మర్ పల్లి  గ్రామాలలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను తీరును ఆయన పరిశీలించారు. దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేలో సమగ్రంగా పొందుపరచాలని సర్వే నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు చోటు లేకుండా, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. స్థలం ఉండి ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. సర్వేను పకడ్బందీగా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నాగపూర్ లో పరువు లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు.ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.