మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా, బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుపగా, వెంటనే స్పందించి నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నారెడ్డి మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి రూ.2000 ఆర్థిక సహాయాన్ని శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అనీఫ్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ సింగ్, మాజీ ఉపసర్పంచ్ ఖలీల్, అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.