మండలంలోని లక్నవరం చెరువు ప్రధాన కాలువలలో ఒకటైన శ్రీ రాంపతికాలు పూడికతీత పనులు శుక్రవారం ప్రారంభించారు. రైతులు అడిగిన వెంటనే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పందించి కలెక్టర్ నిధుల నుండి మూడు లక్షల రూపాయలను మంజూరీ చేయడం సంతోషంగా ఉంది అని కాలువ ఆయకట్టు రైతులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి సీతక్కకు మరియు కలెక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భముగా రైతులు మాట్లాడుతూ మంత్రి సీతక్క ని ప్రత్యేకంగా కలిసి మా పంట పొలాలకు సాగు నీరు అందించే శ్రీరాంపతి కాలువ యొక్క పరిస్థితి గురించి చెప్పి, దాని క్రింద సుమారుగా పదకొండు వందల నుండి పదిహేను వందల ఎకరాలు సాగు చేసుకుంటాం అని, అలాంటిది శ్రీరాంపతి కాలువ కొన్ని సంవత్సరాల నుండి సరిగ్గా పూడిక తీయక అస్తవ్యస్తంగా తయారైందని మీరైనా మా యందు దయతలచి కాలువ పూడిక కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని కోరగా, వెంటనే సీతక్క స్పందించి ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ తో చరవాణిలో మాట్లాడి వెంటనే రైతులకు పూడిక కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయమని కోరగా వెంటనే కలెక్టర్ తన ప్రత్యేక నిధి నుండి 3 లక్షల రూపాయల మంజూరు చేసినారు అని నేడు పూడిక తీయడం కోసం పనులు ప్రారంభించాం అని అన్నారు. రైతుల బాధల్ని వెంటనే అర్థం చేసుకున్న నిధుల మంజూరు కోసం కృషి చేసిన సీతక్క కి, మంజూరు చేసిన కలెక్టర్ దివాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగడ్డ, గాంధీనగర్, మొద్దులగూడెం, ఎల్బినగర్, బాలాజీనగర్, సండ్రగూడెం, పాపయ్యపల్లి గ్రామాల రైతులు అందరూ పాల్గొన్నారు.