మండలంలోని మదన్ పల్లి గ్రామంలో నిర్వహించిన సిఎం కప్ పోటీలలో మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు విన్నర్ గా నిలిచి బహుమతులను ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం తీసుకున్నారు. మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు ఖో ఖో, కబడి మొదటి బహుమతిని, వాలీబాల్ రెండవ బహుమతిని గెలుపొందారు. ట్రైనీ ఐఎఎస్, ఎంపీడీఓ ఇంఛార్జి సంకెత్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు తీసుకున్నారు. విద్యార్థులను పాఠశాల అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.