అడవుల సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని ఎఫ్బీవో లాల్ భాయ్ అన్నారు. శుక్రవారం జన్నారం అటవీ డివిజన్లోని, జింకల పునరావాస కేంద్రం, బట్టర్ ఫ్లై గార్డెన్ గోండ్ గుడా బేస్ క్యాంపులలో రోటిగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు మొక్కలు నాటాలన్నారు. అవి వృక్షాలుగా తయారై వాతావరణ సమతుల్యతకు ఉపయోగపడతాయన్నారు… అటవీ అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.