
నేడు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై క్రాంతి కిరణ్ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీమార్గమే రాజ మార్గమన్నారు. చిన్నచిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా, న్యాయవ్యవస్థ అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.