మమ్మల్ని రెన్యూవల్‌ చేయాలి

– కమిషనర్‌కు ఏఎన్‌ఎంల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గిరిజన సంక్షేమశాఖ పాఠశాల, హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న తమను గతంలో మాదిరిగానే రెన్యూవల్‌ చేయాలని గిరిజన సంక్షేమశాఖ పాఠశాల, హాస్టళ్ల ఏఎన్‌ఎంల సంఘం డిమాండ్‌ చేసింది. శనివారం హైదరాబాద్‌లో ఈ మేరకు సంఘం నాయకులు ఆ శాఖ కమిషనర్‌ క్రిస్టీనా చొంగ్తూకు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే దాదాపు 400 మంది ఏఎన్‌ఎంలు ఏండ్ల తరబడి సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. తాజాగా 623 మంది ఏఎన్‌ఎం పోస్టుల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. తమను రెన్యూవల్‌ చేసిన మిగిలిన ఖాళీలకు ఆన్‌లైన్‌ అప్లికేషన్లను అహ్వానించాలని కోరారు. తమ జీవనోపాధిని కాపాడాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సంఘం గౌరవాధ్యక్షురాలు సలం సావిత్రి, కార్యదర్శులు వినోద, రాజమణి, స్వర్ణలత, లత ఉషారాణి, ధనలక్ష్మితదితరులున్నారు.