తరగతి గదిలో
గురువుల పాఠాలు
విద్యార్థుల బంగారు
భవితకు మార్గదర్శకాలు
పుస్తకాలతో బోధనకై
గురువుల యత్నాలు
విద్యార్థుల గైర్హాజరు
కలవరించేను గురువుల
హదయాలు
కాలానుగుణ పరీక్షలతో
విద్యార్థులు తలమునకలు
వాటి మూల్యాంకనంలతో
గురువుల తర్జనభర్జనలు
అనునిత్యం గురువులు
ఆర్జించే జ్ఞానం విద్యార్థుల
భవితకు మూలాధారం
– డా మైలవరం చంద్రశేఖర్, 8187056918