గ్రూప్-2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్

Incharge Commissioner of Police inspected the Group-2 Examination Centresనవతెలంగాణ – కంఠేశ్వర్ 
గ్రూప్ 2 మొదటి సేషన్స్ పరీక్ష నేపద్యంలో నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి. హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్ ఆద్వర్యంలో వివిధ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి పలుసూచనలు చేశారు. 63 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా ఈ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్)  శంకర్ నాయక్, ఎ.సి.పిలు సి.ఐలు, ఎస్.ఐలు,  సిబ్బంది విధి నిర్వా హణలో పాల్గొన్నారు.