పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే

నవతెలంగాణ – భీంగల్ రూరల్ 
భీంగల్ మండలం పల్లికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మరియు పారిశుధ్య పనులు పరిశీలన నిర్వహించారు.ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్, ఎలాంటి ఆరోపణలు రాకుండా. తప్పులు జరగకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి చర్యలు తీసుకుంటోందని, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారని. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. లబ్ధిదారులను ఎంపిక చేయనున్నామని  భీంగల్ ఎంపీడీవో, గ్రామ సెక్రెటరీ రామ్ మోహన్ అన్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల సర్వేను పూర్తిచేసి యాప్‌లో నమోదుచేయాలని ఆయా జిల్లాల మండలాల అధికారులకు సూచించారు.మొదటి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారని. ఈ నిధులను ధపాలు వారీగా ఇస్తారని. లబ్ధిదారులకు మరో వెసులుబాటును కూడా రేవంత్ సర్కార్ కల్పించింది. ప్రభుత్వం అందించే 400 చదరపు అడుగుల డిజైన్ ను అనుసరించాల్సిన పని లేదు. ఇంకా స్థలం ఉంటే 500 చదరపు అడుగుల్లోనూ ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించిందని గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, గ్రామ సెక్రెటరీ రామ్ మోహన్, కారోబర్, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.