
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ వాడి గ్రామానికి చెందిన సుంకరి గంగాధర్ సమర్పించిన పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రకటించింది. సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుంకర గంగాధర్ తెలంగాణ స్మృతి కవిత్వం సమగ్ర పరిశీలన’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ప్రసిద్ధ కవి, పరిశోధకుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం సుంకరి గంగాధర్ పరిశోధనకు పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య చింతకింది కాసిం, డాక్టర్ రఘు, ఆచార్య వారిజారాణి , డాక్టర్ సల్ల సత్యనారాయణ, డి. గోపాల్, ఘనపురం దేవేందర్, డాక్టర్ భాగ్యలక్ష్మి తదితరులు గంగాధరును అభినందించారు.